ఢిల్లీ పోలీసులకు ఇక్కడేం పని.. తెలంగాణపై అంత ఇంట్రెస్టు ఎందుకో?

by Disha Web Desk 1 |
ఢిల్లీ పోలీసులకు ఇక్కడేం పని.. తెలంగాణపై అంత ఇంట్రెస్టు ఎందుకో?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ పోలీసులకు తెలంగాణ‌లో ఏం పని అని టీపీసీసీ లీగల్ సెల్ నాయకుడు రామచంద్రరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ అనాలోచిత చర్యతో ముందుకు వెళ్తోందని ఆరోపించారు. కేంద్రంలోని కీలక వ్యక్తులు ఢిల్లీ పోలీసులతో అనైతిక చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. తాము నోటీసులు తీసుకుని విచారణకు సహకరిస్తామని చెప్పినా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు తెర లేపారని అన్నారు. మహిళల వద్దకు లేడీ పోలీసు లేకుండా వెళ్లి ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో డైలీ క్రైమ్ రేట్ పెరుగుతుంటే, ఆ పోలీసులకు తెలంగాణపై ఎందుకు అంత ఇంట్రస్ట్? అంటూ ప్రశ్నించారు.

హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా పట్టించుకోకుండా ఓ విద్యార్ధిని అరెస్ట్ చేయాలని చూశారని ఆరోపించారు. బీజేపీ అనైతిక కార్యక్రమాలు ఖండిస్తున్నామని తెలిపారు. వినోద్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము కేసు మొదటి రోజే ఎలక్షన్ కమిషన్ సీఈవో వికాస్‌రాజ్‌ను కలిశామని అన్నారు. స్టేట్ పోలీసు కూడా ఢిల్లీ పోలీసులకు భయపడి వెనక్కు తగ్గే అవకాశం ఉందని చెప్పామని పేర్కొన్నారు. అందుకే చట్టబద్ధంగా న్యాయ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా‌ను ఇబ్బంది పెడితే ఢిల్లీ నుంచి వచ్చే పోలీసులను రాష్ట్రంలోకి రాకుండానే అడ్డుకుంటామని హెచ్చరించారు.

Next Story