‘కేతకి’ కష్టాలు తీరేనా..? సమస్యల వలయంలో కోట్టుమిట్టాడుతున్న ఆలయం

by Shiva |
‘కేతకి’ కష్టాలు తీరేనా..? సమస్యల వలయంలో కోట్టుమిట్టాడుతున్న ఆలయం
X

దిశ, ఝరాసంగం: శివ అంటూ మనసారా తలచుకుంటూ.. జలంతో అభిషేకించినా కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడు.. ఆ పరమేశ్వడు కొలువుదీరిన దివ్యధామం ఝరాసంగం క్షేత్రం. పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి కొలువుదీరిన ఈ క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు నిత్యం దర్శనానికి వేలాదిగా వస్తుంటారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం అనేక దేవాలయాలు అభివృద్ధి చెందాయి. కానీ, గత ప్రభుత్వం ఈ క్షేత్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. కానీ, నారాయణఖేడ్‌లో జరిగిన సభలో నాటి సీఎం కేసీఆర్ కేతకి ఆలయానికి వస్తానని స్వయంగా ప్రకటించారు.

దీంతో ఆలయ రూపురేఖలు మారుతాయని పలువురి భక్తులు ఆశించినప్పటికీ అలాంటి ఏమీ జరగలేదు. తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి 8 నెలలుగా పాలక మండలి లేక భక్తులు ఇక్కట్లు తప్పడం లేదు. గత ప్రభుత్వం హయంలో మూడుసార్లు మూడేళ్ల పాటు పాలక మండలి సభ్యులను నియమించింది. గత అక్టోబర్ మాసం నుంచి ఆలయ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ అభిృవృద్ధి పై దృష్టి పెట్టాలని స్వామివారి భక్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి 8 నెలలుగా పాలక మండలి లేక భక్తులు ఇక్కట్లు తప్పడం లేదు. గత ప్రభుత్వం హయంలో మూడుసార్లు మూడేళ్ల పాటు పాలక మండలి సభ్యులను నియమించింది. గత అక్టోబర్ మాసం నుంచి ఆలయ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పార్వతీ సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఏటా రూ.2 కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఈ ఆలయానికి నూతన పాలక మండలిని నియమించి అభివృద్ధి పనులను చేపట్టాలని స్వామి వారి భక్తులు కోరారు.

భక్తుల రద్దీతో..

కేతకి దర్శనం కోసం వచ్చే భక్తులు హుండీలో వేసిన నగదు కానుకలు, అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చన, దర్శన టికెట్లు, లడ్డు, పులిహోర, కేశఖండనాలు, ఆలయ ఆవరణలో పెళ్లిళ్లు,కొత్త వాహనాలను పూజ, సత్రాల కిరాయిలు కలుపుకొని ఏడాదికి దాదాపు రూ.2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.కానీ ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే అవినీతి జరిగే ఆస్కారం లేదు. ఆలయానికి ప్రతి ఆది సోమవారలతో పాటు అమావాస్య, శ్రావణ మాసం, దసరా ఉత్సవాలు, శివరాత్రి,వేసవి, సెలవులు, వివాహాది శుభకార్యాల రోజులలో భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు.

ఆలయ ప్రధాన సమస్యలు..

ఆలయానికి వచ్చే భక్తులకు ప్రధానంగా ఆలయం ముందున్న ప్రవహిస్తున్న వాలాద్రి వాగు, ఆన్లైన్ వ్యవస్థ, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్, భక్తుల క్యూ లైన్లు, భక్తులు ఉండేందుకు అవసరమయ్యే సత్రాలు, తాగునీటి సౌకర్యం, రోడ్డు డివైడరు మధ్యలో మొక్కల పెంపకం తదితర సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. కాగా ఆలయం చుట్టూ ప్రైవేటు వ్యక్తుల స్థలాలు ఉండడంతో ఆలయానికి ప్రాకార మండపాలను నిర్మాణం చేపట్టలేకపోతున్నట్లు సమాచారం. పెద్ద ఆలయమైనప్పటికీ ఇప్పటివరకు రెగ్యులర్ ఈవో లేకపోవడం, సీనియర్ అసిస్టెంట్ అధికారి పోస్ట్ సైతం ఖాళీగా ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ అధికారులదే హవా కొనసాగుతుందని సమాచారం.

అభివృద్ధి పనులు చేపడుతున్నాం: ఈవో శశిధర్

దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం గర్భాలయంలో స్వామి వారికి బంగారుతో మకర తోరణం తాపడం, ప్రధాన దర్వాజ తలుపుల కు వెండి తొడుగు మూడు ముఖ ద్వారాలకు టేకుతో నూతన దర్వాజాలు, వాహనాలకు పార్కింగ్ స్థలం పరిశీలిస్తున్నాం.

Advertisement

Next Story

Most Viewed