నటుడు చందు మరణం పై తండ్రి చేసిన సెన్సేషనల్ కామెంట్స్..!

by Kavitha |
నటుడు చందు మరణం పై తండ్రి చేసిన సెన్సేషనల్ కామెంట్స్..!
X

దిశ, సినిమా: 'త్రినయిని' సీరియల్‌లో నటించిన చందు మన అందరికి సుపరిచితమే. ప్రస్తుతం చందు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో కూడా నటిస్తున్నారు. కాగా 2015లో శిల్ప అనే ఆమెను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చందు శుక్రవారం హైదరాబాద్ లోని త్రినయని నటి పవిత్ర ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

అయితే నటుడు చందుకు సంబంధించిన ఒక్కొక్క విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నటుడు చందు భార్య శిల్ప చెందుకు గత ఐదు సంవత్సరాల నుండి పవిత్ర జయరామ్‌తో ఉన్న అక్రమ సంబంధాన్ని తెలియజేసింది. తాజాగా నటుడు చందు తండ్రి కూడా ఆయనకు సంబంధించిన అనేక విషయాలు తెలియజేశారు.

సీరియల్ యాక్టర్ చందు తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ.. పవిత్ర తో రిలేషన్‌లో ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, భార్య పిల్లల్ని వదిలేసి గత ఐదేళ్లుగా చందు మా ఇంటికి రాలేదు, పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి.. మూడు రోజుల క్రితం మా ఇంటికి వచ్చి నేను పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పాడు. అలా చేసుకోవద్దని చెప్పాము. కానీ శుక్రవారం పొద్దున్న లకడికపూల్ వెళ్లి వస్తా అని చెప్పి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు అంటూ వాపోయాడు. మేమందరం కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదని., అయితే మాకు తెలిసిన వ్యక్తిని చందు ఫ్లాట్ కి పంపిస్తే ఇంట్లో డోర్ పగలగొట్టి చూస్తే బాల్కనీ లో సూసైడ్ చేసుకున్న బాడీ వేలాడుతూ ఉన్నట్లు తెలిపాడు. మేము వెళ్లేసరికి అక్కడికి పోలీసులు వచ్చారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం కోసం బాడీని ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారని ఆయన తెలిపారు.దీంతో నటుడు చందు సంబంధించిన అనేక విషయాలు ఒక్కొక్కటి గా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story