- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అగంతకుడి చేతిలో మారణాయుదాలు ఉంటే..? దుండగుడి ప్రవేశంపై బీజేపీ ఎంపీ ఆందోళన

దిశ, వెబ్ డెస్క్: అర్థరాత్రి తన ఇంట్లోకి దుండగుడు ప్రవేశించడంపై మహబూబ్ నగర్ (Mahaboob Nagar) ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దుండగుడు ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడో అర్థం కావడం లేదని, అతడి చేతిలో మారణాయుదాలు ఉంటే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ (Jubilee Hills) లోని తన నివాసం నుంచి ఫోన్ వచ్చిందని, అర్థరాత్రి ఇంట్లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, గదులలో తిరిగినట్లుగా అడుగుల గుర్తులు కనిపిస్తున్నాయని ఇంట్లోని వ్యక్తులు ఫోన్ చేసినట్లు తెలిపారు. ఈ విషయం విని నిర్ఘాంత పోయానని, వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించినట్లు చెప్పారు.
దుండగుడు దాదాపు గంటన్నర సేపు ఇంట్లో తచ్ఛాడాడని, కానీ ఏ రూం కూడా తెరిచేందుకు ప్రయత్నించలేదని అన్నారు. ఇంట్లో చాలా సేపు రెక్కీ నిర్వహించాడని, కానీ దేని కోసం వచ్చిండో ఇంతవరకు అర్థం కావడంలేదని తెలిపారు. ఘటనపై తమ కుటుంబం అంతా ఆందోళనలో ఉన్నదని, అగంతకుడి చేతిలో మారణాయుదాలు ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వం (Government) సెక్యూరిటీ (Security) పెంచాల్సిన అవసరం ఉన్నదని డీకే అరుణ అన్నారు. కాగా బీజేపీ ఎంపీ డీకే అరుణకు చెందిన జూబ్లీహిల్స్ లోని నివాసంలోనికి శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడు. సీసీ కెమెరాలను ఆఫ్ చేసి కిచెన్, హాల్ సహా ఇంట్లో కలియ తిరిగాడు. దీనిపై అప్రమత్తమైన డీకే అరుణ వ్యక్తిగత సిబ్బంది ఆమెకు సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.