ఒక గొప్ప చిత్రమిది! తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
ఒక గొప్ప చిత్రమిది! తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీస్ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ శుక్రవారం ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘ఒక గొప్ప చిత్రమిది! తండ్రికి-పిల్లలకు మధ్య ఫోన్ అడ్డు కాకూడదు. అది తండ్రైనా, పిల్లలైనా! క్రమశిక్షణతో కూడిన సురక్షితమైన రేపటి సమాజానికి మీరు పునాది వేయాలంటే వారితో సరైన సమయం కేటాయించి వాళ్లకి మంచి-చెడు విశదీకరించాలి. అప్పుడే దేశం పరిపక్వతతో కూడిన ప్రగతి వైపు పరుగులు పెడుతుంది’ అని ఒక ఫోటో పోస్ట్ చేశారు.

మరో ట్వీట్‌లో తండ్రీ, కుమర్తె బంధంపై సోషల్ మీడియాలో అసభ్య, అశ్లీల సంభాషణ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనిపై తెలంగాణ పోలీసులు స్పందించారు. ‘సోషల్ మీడియాలో, ఇతర డిజిటల్ వేదికల్లో అసభ్యకరమైన, విద్వేషకరమైన వాఖ్యలు జైలు గోడల మధ్య బందీకి దారి తీస్తాయి. సమాజంలో స్నేహపూర్వక వాతావరణానికి ఇబ్బంది కలిగించకుండా మనుషులమనే విచక్షణతో ప్రవర్తించాలి. సోషల్ మీడియాలో మీ, మీ కుటుంబ వ్యక్తిగత ఫోటోలు పోస్ట్ చేయకండి’ అని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed