పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: రాచకొండ CP డీఎస్ చౌహాన్

by Satheesh |
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: రాచకొండ CP డీఎస్ చౌహాన్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: చనిపోయిన పోలీసు కుటుంబాలకు వీలైనంత త్వరగా పెన్షన్​అందేలా చూడటంతో పాటు ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ​డీఎస్ చౌహాన్​ సూచించారు. రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కుటుంబాలకు గురువారం కమిషనర్ భద్రత, ఎక్స్​గ్రేషియా చెక్కులను తన కార్యాలయంలో అందచేశారు. అనంతరం వారి యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ భరోసా కల్పించారు. పోచంపల్లి పోలీస్​ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్​ఇన్స్​పెక్టర్‌గా పని చేస్తూ చనిపోయిన జాన్సన్ ​భార్య సునీతకు భద్రత నుంచి 7 లక్షల తొంభై తొమ్మిది వేలు, విడో ఫండ్‌గా పదివేలు, ఫ్లాగ్​ఫండ్‌గా పదివేలు, కార్భస్​ఫండ్‌గా యాభైవేల రూపాయల చెక్కులు అందచేశారు.

అదేవిధంగా మల్కాజిగిరి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ చనిపోయిన నరేష్​కుమార్​భార్య లక్ష్మీభాయికి భద్రత నుండి 3లక్షల తొంభై మూడువేలు, కూతురు పేరునా లక్షా 96వేలు, కుమారుని పేరునా లక్షా 96వేల రూపాయల చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఇక, తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులను కమిషనర్​క్లియర్​చేయటంపై పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ నర్మద, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story