- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Caste Census : కులగణనను ప్రజల ముందు ఉంచుతాం : బీసీ కమిషన్ ఛైర్మన్
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కులగణన(Caste Census)పై బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్(Niranjan) కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే తుది నివేదికను దాచకుండా ప్రజల ముందు పెడతామని పేర్కొన్నారు. నేడు కరీంనగర్లో నిర్వహించిన ప్రజాఅభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న నిరంజన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జరిపిన కుటుంబ సమగ్ర సర్వే వివరాలు ఎవరికీ తెలియకుండా దాచారు. ఆ సర్వేలో ఏముందో భగవంతునికే తెలియాలి. అంతగా దాచాల్సిన అవసరం ఏముందని నిరంజన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) బీసీల కులగణనను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమలు పరుస్తున్నాడని పేర్కొన్నారు. సర్వే పూర్తయ్యాక తుది నివేదికను ప్రజల ముందు పెడతామని, ఏదీ దాచమని తెలియ జేశారు. ఏపీకి చెందిన కొన్ని కులాలను ఇక్కడ బీసీలుగా పరిగణించకూడదు అని విజ్ఞప్తులు వస్తున్నాయని... కొన్ని బీసీ కులాల వారు కూడా తమ పేరు చివరన రెడ్డి, పటేల్ అని పెట్టుకుంటారని, అలా అని వారు ఓసీ వర్గానికి చెందిన వారు కాదని అన్నారు. కులం పేరు తప్పుగా నమోదు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ సర్వే ద్వారా అన్ని కులాల వారి లెక్కలు, వారి ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయని అన్నారు. ఈ సర్వేను ఎవరూ అడ్డుకోవద్దని, అపోహలు సృష్టించవద్దని, రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. న్యాయ నిపుణుల సలహా మేరకు ప్రజాఅభిప్రాయ సేకరణ ఈనెల 13 వరకు కొనసాగుతుందని, ప్రజలు తమ అభిప్రాయాలను, విజ్ఞప్తులను తెలపవచ్చునని పేర్కొన్నారు.