నెత్తుటి బాకీ తీర్చుకుంటాం.. ఆజాద్ పేరిట మావోయిస్టులు హెచ్చరిక లేఖ విడుదల

by Kalyani |   ( Updated:2022-12-28 13:57:34.0  )
నెత్తుటి బాకీ తీర్చుకుంటాం.. ఆజాద్ పేరిట మావోయిస్టులు హెచ్చరిక లేఖ విడుదల
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: మంగి, ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి (లింగవ్వ)అనితక్క, మరో కామ్రేడ్ అశోక్ ల ఎన్ కౌంటర్ బూటకమని దండకారణ్య డివిజన్ కార్యదర్శి ఆజాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్న అశోక్, అనితక్కలను విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో పట్టుకొని చంపి, టేకుమెట్ల ఎన్ కౌంటర్ అని కట్టు కథ అల్లుతున్నారని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని లేఖలో కోరారు. ఒక ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో అనితక్క, అశోక్ ని పట్టుకొని చిత్రహింసలకు గురిచేసి, వాళ్ల గోర్లు, వేళ్లని కత్తిరించి చిత్రవద చేసి ఇద్దరిని అతి కిరాతకంగా పోలీసులు చంపారని, దీనిని ఎన్ కౌంటర్ గా నమ్మించడానికి మహారాష్ట్ర, ఛత్తీస్ ఘఢ్, తెలంగాణ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారన్నారు. కామ్రేడ్ అనిత ఉద్యమంలో చురుకుగా పనిచేసేదని, గ్రామాల్లోకి వెళ్లి మహిళ సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించేదని, ఆ ఏరియాల్లో మహిళా ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. మహిళల ఆత్మ గౌరవం కోసం పోరాడింది అని, మహిళలకు ఒక దిక్సూచి. అనితక్క పనితనం అని పేర్కొన్నారు. చురుకుదనం చూసి బెదిరిన తెలంగాణ దొరల ప్రభుత్వం పోలీసుల ద్వారా బూటకపు ఎన్ కౌంటర్ చేయించిందని ఈ లేఖలో తెలిపారు. ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని అంతమొందించేందుకు చేస్తున్న హత్యల్లో ఇది మొదటిదికాదు, చివరిది అంతకన్నా కాదని. దోపిడీ ప్రభుత్వాలు ప్రజల బిడ్డలను బలితీసుకోవడం మా పార్టీకి కొత్తేమీ కాదు. ప్రజా యుద్ధంలో అనేక మంది వీరులు నేలకొరుగుతూనే ఉన్నారు. వారి త్యాగాలు వృథాకావు. దోపిడీ ఉన్నంత కాలం ప్రజా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పిరికిపంద హత్యలకు పోలీసు, ఇన్ఫార్మర్ లకు త్వరలోనే తగిన సమాధానం చెబుతాం. వారి నెత్తుటి బాకీ తీర్చుకుంటాం అంటూ ఆజాద్ పేరుతో హెచ్చరిక లేఖ విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed