- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాదిగల రిజర్వేషన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము.. వరంగల్ సభలో ప్రధాని మోడీ
దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం వేములవాడ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వేములవాడ, కరీంనగర్ సభలో పాల్గొన్నారు. అనంతరం వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థుల తరపున వరంగల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి.. వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తొందని అన్నారు. అలాగే బీ రిజర్వేషన్లను ఇండియా కూటమి హరించాలని చూస్తుంది. మరి మీరు చూస్తూ ఊరుకుంటారా.. అని ప్రధాని ప్రశ్నించారు.
దీంతో పాటుగా.. గత కొన్ని సంవత్సరాలుగా మాదిగ సమాజం తన హక్కుల కోసం పోరాడుతొందని.. మాదిగాల రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని.. ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. అలాగే గిరిజన ప్రాంతానికి కేంద్ర సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీని ఆమోదించి ఇస్తే.. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీకి ఆటంకాలు పెడుతోందని ప్రధాని ఆరోపించారు. తాము చేపడుతున్న చర్యల వల్ల ఎస్సీ, ఎస్టీలుే అభివృద్ధి చెందుతున్నారని.. అలా జరిగితే వారు కాంగ్రెస్ పార్టీకి నమ్మరనే భయం పట్టుకుందని మోడీ అన్నారు.