- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కర్ణాటక ఎన్నికలు జోష్ నింపాయి.. అవే ఫలితాలు తెలంగాణలో సాధిస్తాం: చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికలు జోష్ తమలో నింపాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా సమన్వయంతో పని చేస్తూ ఫలితాలను తీసుకొస్తామన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఎదురులేదన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కర్ణాటక ప్రజలు ఓ మంచి తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు.
అదే విధంగా దేశ మార్పు కోసం తెలంగాణ ప్రజలకు కూడా కాంగ్రెస్‌ను ఆదరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం మెరుగు పడాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ కార్పొరేట్వ్యవస్థలే అన్నారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలను కూడా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. మోసపూరిత ప్రభుత్వాలకు చెక్‌పెట్టాలని కిరణ్ రెడ్డి కోరారు.