- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ అధికారంలో ఉండాలని కోరుకుంటాం: కడియం శ్రీహరి
దిశ, డైనమిక్ బ్యూరో: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలనైనా తూచ తప్పకుండా పాటించాలన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన మాయమాటలతో మభ్యపెట్టి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ యూత్ డ్లిక్లరేషన్ లో పేర్కొన్నారని కానీ నిన్న సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట మార్చి తాము ఎక్కడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అంటున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సభలో ఆ అంశాన్ని ప్రస్తావించడం లేదన్నారు. ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం మాట తప్పే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజల పక్షాన కొట్లాడుతామన్నారు.