- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cm Revanth Reddy: మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్: సీఎం రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహక కల్పించేందుకు ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్-2024 కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందని తమ ప్రభుత్వం నమ్ముతున్నదన్నారు. ఉమెన్ హెల్త్ కేర్ ను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య రంగ అభివృద్ధికి పెద్దపీఠవేస్తున్నామని మహిళల కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ మహిళల సాధికారత కోసం మనమంతా కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాకులను అభినందిస్తున్నాను. అంతకు ముందు ఈ రన్ ను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రారంభించారు.