- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భూపాలపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
దిశ, వరంగల్ బ్యూరో : భూపాలపల్లి జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం రేగొండ మండల పరిధిలోని పాండవుల గుట్ట, కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్న పేట శాసనసభ్యులు నాగరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు, పురాతన కట్టడాలు, దేవాలయాలు, జలాశయాలు, అడవులు ఉన్నాయని తెలిపారు. పాండవుల గుట్టకు ఎంతో ప్రాశస్త్యం ఉందని పాండవులు ఇక్కడ వనవాసం చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత యువతకు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. గొప్ప చారిత్రక ప్రదేశమని, ఈ గుట్టలో ఆనాటి కాలపు పెయింటింగ్స్ ఇప్పటికీ చెక్కుచెదరలేదని తెలిపారు. పాండవుల గుట్ట రాష్ట్ర, దేశ,
విదేశాల పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేస్తామని అన్నారు. అన్ని వయస్సుల వారు సందర్శిస్తుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. రోప్ వే, ట్రెక్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ శాఖల మంత్రుల ద్వారా రహదారి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని అన్నారు. కార్యక్రమంలో పర్యాటక సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అటవీ అధికారి వసంత తదితరులు పాల్గొన్నారు.