మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఘటనపై కేంద్ర సంస్థల దర్యాప్తు కోరుతాం : ఈటల

by Disha Web Desk 23 |
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఘటనపై కేంద్ర సంస్థల దర్యాప్తు కోరుతాం : ఈటల
X

దిశ, కాటారం : కాలేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ లో కృంగిపోయిన ఘటనపై కేంద్ర సంస్థల దర్యాప్తును కోరుతామని హుజరాబాద్ శాసనసభ్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం లక్ష్మీ బ్యారేజీ ను బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, చంద్రవదన్, మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్, పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పరిశీలించారు. బ్యారేజ్ కు జరిగిన నష్టం పై బాధ్యులెవరో కారకులెవరు గుర్తించి సమగ్ర దర్యాప్తు చేసి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలని సమగ్ర విచారణ చేసి శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం కేసిఆర్ ను ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

సమాచారం లేకుండా లక్ష్మీ బ్యారేజీ గేట్లను ఎత్తివేసి 10 పిఎసి ల నీటిని దిగువకు విడుదల చేయడంతో వరద నీటిలో వందలాది విద్యుత్ మోటార్లు పశువులు గొర్రెలు మేకలు కొట్టుకపోయాయని పంటలకు నష్టం వాటిని రైతులు తీవ్ర ఆర్థికంగా నష్టపోయారని రాజేందర్ పేర్కొన్నారు. పోలీసులను పెట్టి ఎవరిని ప్రాజెక్టు దగ్గరికి వెళ్లనీయకుండా నిర్బంధించి నంత మాత్రాన సత్యాలు దాగయని రాజేందర్ ఆరోపించారు. కృంగిపోయిన ప్రాజెక్టును ఈ ప్రాంత ప్రజలందరూ ఉదయం వెళ్లి చూసి బాధపడ్డారని ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story