కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా వంశవర్ధన్ రావు..

by Sumithra |
కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా వంశవర్ధన్ రావు..
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన ఒన్న వంశవర్ధన్ రావు నియమిస్తూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్వేష్ శుక్రవారం ఉత్సవాలు జారీ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో ఈ నియామకం జరిగింది. రేగులగూడెం పంచాయతీ గ్రామసర్పంచ్ గా పనిచేశారు. మండల కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆశీస్సులతో ఈ పదవి లభించినట్లు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎమ్మెల్యే ఉంచిన నమ్మకంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వంశవర్ధన్ రావు తెలిపారు. ఈ పదవిలో నియామకానికి కృషిచేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మండల సర్పంచుల పోరం అధ్యక్షుడు తెప్పెల దేవేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed