- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డోర్నకల్‌లో మొదలైన పాదయాత్ర.. రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇవే!
దిశ, మరిపెడ : డోర్నకల్ నియోజకవర్గంలో నరసింహులపేట మండలంలోని పెద్దనాగరం స్టేజి నుంచి ప్రారంభమైన యాత్ర మార్గమధ్యలో ఎల్లంపేట స్టేజి వద్ద భూక్య బాలు అనే వికలాంగుడ్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. మధ్య మధ్యలో మిర్చి రైతులను పత్తి రైతులను కలిశారు. డబుల్ బెడ్ రూమ్లను పరిశీలించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వేలాది మంది పాద యాత్రకు స్వాగతం పలికారు.ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాడం కోసం కులాల,మతాల మధ్య మోడీ ప్రభుత్వం చిచ్చు పెడుతుంటే..దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ జోడో యాత్ర ను చేపట్టారు.
రాహుల్ యాత్రను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో యాత్ర ను చెప్పట్టం.కేసీ ఆర్ కుటుంబం రాష్ట్రంనుదోచుకుంటూ.పోతుంటే.ఇక్కడ ఎం ఎల్ ఏ కుటుంబం దోచుకుంటుంది ఉదయం నుంచి వీ ఆర్ఏ లు,యువకులు,విద్యార్థులు,ఉపాద్యాయులు,డబుల్ బెడ్రూం ,ల మోసం కళ్ళారా చూసాను.
మిర్చి రైతుల గోస చెప్పలేం. లక్ష్మీ అనే మహిళా రైతు రెండు ఎకరాల్లో అప్పు చేసి పంట సాగు చేస్తే దిగుబడి లేక.గిట్టు బాటు దర లేక తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం ఉంది. నియోజకర్గంలో డబుల్ బెడ్రం ఇల్లు మొండి గోడలు దర్శనం ఇస్తున్నాయి.విద్య లో నియోజక వర్గం వెనుక బడి ఉంది. పత్తి రైతుల ఆవేదన కళ్ళకు నీళ్లను తెప్పించింది. ఎంపి ,ఎం ఎల్ ఏ భూ కబ్జాలు,ఎం ఎల్ ఏ కొడుకు బియ్యం,బెల్లం దందాలు చేస్తున్నారు. రేవంత్ దందాలు చేస్తున్నానని మాట్లాడుతున్నారు.. ఈ తెలంగాణ ప్రజల సొమ్ము తో నిర్మించిన ప్రగతి భవన్ లో ఎందుకు ప్రవేశం లేదో చెప్పాలి.
ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము తో నిర్మించిన బంగళా లో పేద ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదో చెప్పాలి. మళ్ళీ చెప్తున్న ప్రగతి భవన్ నీ బద్దలు కొడతాం..దాని పై కాంగ్రెస్ జెండా ఎగురేసి..అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తాం.అమర వీరుల,కవుల ,కళాకారుల త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పంది. ప్రగతి భవన్ నీ బద్దలు కొడుతాం..ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. కురవి వీర భద్రుదికి నఖిలి మీసాలు పెట్టీ దేవుడ్ని కూడా మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కి దక్కింది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని 2024 జనవరి 1న లో ధరణిని రద్దు చేస్తం మొదటి సంతకం దానిపైనే పెడతామని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాకు పెట్టిన అధికారులను జైల్లో వెస్తం.