- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్: రణరంగంగా కేయూ క్యాంపస్.. విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జ్!

దిశ, కేయూ క్యాంపస్: విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల అరెస్టుల పర్వంతో కాకతీయ యూనివర్సిటీ రణరంగంగా మారింది. కేయూలో బుధవారం తలపెట్టిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విద్యార్థి సంఘాల నేతలు హైకోర్టులో తేల్చుకుంటామని ప్రకటించారు.
సభ రద్దు కావడంతో కాకతీయ యునివర్సిటీ లైబ్రెరీ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులు మహా ధర్నాకు దిగారు. విద్యార్థుల ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలోనే విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు వర్సిటీలో విధ్వంసానికి దిగారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద అద్దాలను, కుర్చీలను విరగొట్టారు. బలవంతంగా పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి కేయూ స్టేషన్ కు తరలించారు.