- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జాతరకు ప్రభలు ముస్తాబు

X
దిశ,గీసుగొండ : కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి జాతర శుక్రవారం నుండి ప్రారంభమైంది. జాతరకు అన్ని పార్టీల ప్రభ బండ్లు ముస్తాబై కొమ్మాల స్టేజీ వద్ద ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే రేవూరి వర్గం, కొండా మురళి వర్గం ప్రభ బండ్లను రెడీ చేయగా బీఆర్ఎస్, బీజేపీ ప్రభ బండ్లు కూడా జాతరకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాయి.
తొలుత ఎమ్మెల్యే రేవూరి వర్గం ప్రభ బండి జాతరకు వెళ్లనుండగా ఎమ్మెల్యే రేవూరి మరి కొద్ది సేపట్లో కొమ్మాలకు వచ్చి ప్రభ బండిని ప్రారంభించనున్నారు. కొండా వర్గం వారు కూడా ప్రభ సిద్ధం చేయగా సుమారు పది గంటలకు కొండా మురళి వచ్చి బండిని ప్రారంభించనున్నారు. కాగా అన్ని పార్టీల కార్యకర్తలు కొమ్మాల చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story