- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘కాంబోడియా దేశంలో చిక్కిన నాకు విముక్తి కల్పించండి’..దిశ కథనానికి స్పందించిన జిల్లా పోలీసు శాఖ
దిశ,బయ్యారం : కంబోడియా దేశంలో బందీగా చిక్కుకొని నన్ను రక్షించండంటూ ,నన్ను భారతదేశానికి రప్పించి విముక్తి కల్పించాలని గత మే 27 ,28న దిశలో ,సామాజిక మాద్యమాల్లో ప్రచురితమైంది. మున్షిఫ్ ప్రకాష్ వేడుకున్న వీడియోలకు తక్షణమే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామనాధ్ సుధీర్ కేకన్ స్పందించాడు. కాంబోడియాలో ఉన్న ఎంబసీ అధికారులతో మాట్లాడి అతని యోగక్షేమాలపై ఆరాతీసి అతనిని సేఫ్ జోన్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా గార్ల బయ్యారం సీఐ రవికుమార్ గందపల్లిలోని బాధితుడు అన్న ప్రశాంత్ వారి బంధువులతో మాట్లాడి ధైర్యం కల్పించి భారత్ కు రప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈనెల 6న కాంబోడియా దేశం నుంచి స్వదేశానికి తిరిగి రావడంతో వారి కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు. బాదితుడు మరో రెండు రోజుల్లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ని నేరుగా కలిసి కృతజ్ఞతలు ,అభినందనలు తెలుపనున్నట్లు ఫోన్ లో దిశ ప్రతినిధి కి తెలిపారు.నా విముక్తి కి తోడ్పాటు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.