- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవనం నిర్మించారు.. ప్రారంభోత్సవం మరిచారు..
దిశ, హన్మకొండ: హన్మకొండ జిల్లా కాజిపేట్ మండల కేంద్రంలో మూడు సంవత్సరాల క్రితం మండల విద్యా వనరుల కేంద్ర భవనాన్ని నిర్మించిన అధికారులు, ప్రారంభోత్సవం చేయడం మరిచారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాజిపేట్ మండలంగా ఏర్పడిన తరువాత ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్, మండల విద్యాశాఖ అధికారి భవనం కోసం నిర్మించిన భవనం నిరూపయోగంగా ఉండటంతో విద్యారంగం కుంటుపడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నిర్వహణ విద్యార్థుల సమస్యలు, తదితర వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయవలసిన అధికారి అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. వివిధ సమస్యలపై హన్మకొండలోని వడ్డేపల్లిలో ఉన్న విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లవలసి వస్తుందని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో నిర్మించిన భవనాన్ని ప్రారంభించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.