కమ్యూనిస్టులే కబ్జాకోర్లు.. బీఆర్ఎస్ లో చేరి భూ దందాలు

by Javid Pasha |
కమ్యూనిస్టులే కబ్జాకోర్లు.. బీఆర్ఎస్ లో చేరి భూ దందాలు
X

దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ నగరంలో కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు బీఆర్ఎస్ లో చేరి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని బీజేపీ వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆడెపు వెంకటేష్ ఆరోపించారు. ఖిలా వరంగల్ మండలం చింతల్, జాన్ పాక ప్రాంతాలలోని ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను సర్వే నంబర్ 462 లో గల దాదాపు 24 ఎకరాలను భూములను ఆక్రమించినట్లు తెలిపారు. ఆదివారం స్థానికులతో కలిసి కబ్జాకు గురైన భూముల్లో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ లోపాలతో నగరంలో ఆక్రమణలు పెరిగాయని అన్నారు. బీఆర్ఎస్ నాయకులే వీఆర్ఓలుగా చలామణి అవుతూ భూకబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు.

ఎలక్షన్ల సమయంలో తూర్పు ఎమ్మెల్యే చింతల్ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటా అన్నది కేవలం ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికే అని ఆరోపించారు. ఈ ప్రాంతానికి చెందిన డిప్యూటీ మేయర్ కూడా ఇలాంటి భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. చింతల్ ప్రాంత వాస్తవ్యులు గత 30 సంవత్సరాలుగా వెనుకబాటుకు గురి అవుతున్నారని అన్నారు. ఈ రోజు వరకు కూడా చింతల్ ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాల లేదు, ఒక ప్రాథమిక వైద్యచికిత్స కేంద్రం లేదు, ఒక ఓవర్ హెడ్ టాంక్ లేదు, ఒక్క ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ లేదు, ఒక పబ్లిక్ పార్క్ లేదు...ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి లాండ్ అలోకేట్ చేయలేదని అన్నారు.

ఈ ప్రాంతంలో జరుగుతున్న భూకబ్జాలపై రెవెన్యూ, కలెక్టర్, తహశీల్దార్, పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవసరమైతే స్థానికులతో కలిసి పోరాడుతామన్నారు. కార్యక్రమంలో ఆడెపు మధుసూధన్, దుస్సా శ్రీధర్, బంకా రాజుకుమర్, అంబటి అనిల్, కొండ మహేష్, జోగు రాజేంద్రప్రసాద్, రమేష్, చంద్ర మోహన్, గొర్రె కోటి, రాజు, జోగు మధు కుమార్, వంగ సంపత్, కంద గట్ల మల్లికార్జున్, క్రాంతి, కారపుడి ఉమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story