- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైరల్ అవుతున్న డోర్నకల్ రైల్వే పాఠశాల పూర్వ విద్యార్థుల ఫొటోలు
దిశ ప్రతినిధి, వరంగల్: ప్రతీ ఒక్కరి జీవితంలో పాఠశాల స్నేహితులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నిష్కల్మషమైన అనుబంధాలకు ప్రతీకలు వాళ్లు. అందుకే జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పాఠశాల ఫ్రెండ్ కలవగానే.. కాసింత తిట్టుకుంటూనే, గత స్మృతులను నెమరువేసుకుంటూ చిన్నపిల్లోళ్ల మారిపోతుంటారు. సరిగ్గా డోర్నకల్ పూర్వవిద్యార్థులు అలాగే మారిపోయారు. మాటల్లోనే కాదు.. ఏమాత్రం సిగ్గుపడకుండా సగర్వంగా ఆనందంతో స్కూల్ యూనిఫాంలో వేడుకకు హాజరుకావడం విశేషం. 1989-90లో డోర్నకల్ రైల్వే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు 32ఏళ్ల తర్వాత ఆదివారం ఇదే మండలంలోని చిలుపూరు బాలజీ దేవాలయానికి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా యూనిఫాం వేసుకుని రావడం గమనార్హం. అయితే, ఇద్దరు విద్యార్థులకు మాత్రం యూనిఫామ్ ప్యాంట్లు సరిపోకపోవడంతో నెక్కర్లు వేసుకొని హాజరు కావడం విశేషం. కార్యక్రమం ఆసాంతం యూనిఫాంలో ఉంటూ స్కూల్ లైఫ్‌లో జరిగిన అనేక సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషించారు.