Arrested : దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్

by Kalyani |   ( Updated:2024-08-12 09:44:53.0  )
Arrested : దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్
X

దిశ, జనగామ: ఇటీవల వరుస దొంగతనాలతో జనగామలో అలజడి సృష్టిస్తున్న దొంగలను పట్టుకున్నట్లు డిసిపి రాజమహేంద్ర నాయక్ తెలిపారు. ఇళ్లలో చోరీ చేసిన ముగ్గురు దొంగలు సొత్తును విక్రయించే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు హాజరుపరిచి డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ..ప్రధానంగా తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేయడంలో అనుభవజ్ఞులైన నేరస్థులని, కూలీ పని చేసుకుంటూ ఉండే వీరు తాగుడుకు, జల్సా లకు డబ్బులు సరిపోక డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే దొంగతనాలు చేశారని చెప్పారు.

ముగ్గురు నిందితులు చుకుటాల కుమార్, బూరుగు యాదగిరి, తల తోటి ప్రవీణ్ వారి నుంచి 7.3 బంగారం నగలు, 64 తులాల సిల్వర్ మొత్తం రూ. 5,74, 320 సొత్తు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచనల మేరకు ఏ సీపీ పార్థసారథి నేతృత్వంలోని సీఐ దామోదర్ రెడ్డి ఎస్సై భరత్ పోలీసు బృందం నెహ్రూ పార్క్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ భరత్, ఏఎస్ఐ శంకర్, కానిస్టేబుల్ రామన్న, అనిల్ కుమార్, సురేష్ లను వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed