- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ చర్యలు చేపట్టండి: కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
దిశ, జనగామ: యాసంగిలో భాగంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, ప్యాడి కాంట్రాక్టర్స్, సహకార సంఘాలు, సంబంధిత అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2022-23 యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాల సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఐకేపీల ఆధ్వర్యంలో 111 ప్రాథమిక సహకార సొసైటీల ఆధ్వర్యంలో 89 కలిపి మొత్తం 200 సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 32 లక్షల గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఆయా సెంటర్లలో కావలసిన సౌకర్యాలు, వేయింగ్ మిషన్స్, టార్పాలిన్స్, మ్యాచర్ మీటర్స్, ప్యాడి క్లీనర్స్ తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, ధాన్యం రవాణా చేయుట, సెంటర్ల నిర్వహణ, తదితర అంశాలపై ఎలాంటి ఫిర్యాదులైన కంట్రోల్ రూం 6303928718 ను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, అధికారులు సీహెచ్. మధుమోహన్, కృష్ణవేణి, రాంరెడ్డి, కిరణ్ కుమార్, ఎం.రోజా రాణి, శర్మ, సంధ్యారాణి, వినోద్ కుమార్, సింగం, శ్రీనివాస్, ప్రకార్ వర్మ, శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.