- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
SR University : ఎస్సార్ నాట్ సేఫ్.. తరుచూ వివాదాల్లోకి వర్సిటీ..
దిశ, వరంగల్ బ్యూరో : ఎదిగిన పిల్లలు క్రమశిక్షణతో భవిష్యత్‌కు నిచ్చెనలు వేసుకంటూ ఉత్తమ మార్గంలో వెళ్లాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇంటర్ పూర్తయ్యాక ఏ కళాశాలలో చేర్పించాలనే విషయం పై చేసే కసరత్తు, వెదుకులాట, మానసిక సంఘర్షణ అంతఇంత కాదు.. జీవితాంతం కూడబెట్టిన సొమ్మంతా.. ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు ఖర్చు చేస్తుంటారు. తమ పిల్లలకు మంచి చదివి చెప్పి జీవితంలో సెటిల్ చేసే బాధ్యతను కళాశాలలకు అప్పగిస్తుంటారు. అయితే ఇలా విద్యార్థుల భవితకు సంబంధించిన బరువు, బాధ్యతలను మోయాల్సిన కళాశాలను గాలికి వదిలేస్తోంది. మొక్కుబడిగా చదువు చెప్పేసి.. క్రమశిక్షణ, సత్‌ప్రవర్తన అనే గురుతర బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది ఎస్సార్ యూనివర్సిటీ యాజమాన్యం. అంతేకాదు.. జరిగిన తప్పులను సభ్యసమాజం దృష్టికి రాకుండా చాలా బాగా కవర్ చేస్తుండటం గమనార్హం.
పెడదోవ పడతున్న ఎస్సార్ విద్యార్థులు !
ఎస్సార్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు పెడదోవ పడుతున్నారన్న విమర్శలు.. తరుచూ వెలుగులోకి వస్తున్న ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లోని ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల కొన్నాళ్ల కిందట యూనివర్సిటీగా మారింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం కళాశాలలో చేరుతున్న విద్యార్థులు చెడు వ్యసనాలు, కాలేజీలో గ్యాంగులుగా మారి దాడులకు పాల్పడుతున్నారు. యాజమాన్యం, అధ్యాపక బృందం పర్యవేక్షణ లేకపోవడంతోనే విద్యార్థులు వక్రమార్గంలోకి ప్రవేశిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సార్ వర్సిటీలో ర్యాంగింగ్ పేరుతో విద్యార్థులను భయాందోళన, మానసిక హింసకు గురిచేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కళాశాలలో అనేక మార్లు ర్యాగింగ్ ఘటనలు, విద్యార్థుల మధ్య కొట్లాటలు జరుగుతున్న ఘటనలు బయటకు రాకుండా యాజమాన్యం కవర్ చేసిందని విద్యార్థులే చెబుతుండటం గమనార్హం. కొన్నాళ్ల క్రితం సీనియర్స్, జూనియర్స్ మధ్య కళాశాలలో గొడవలు చెలరేగడంతో హసన్‌పర్తి మండలం బావుపేట క్రాస్ రోడ్డు వద్ద పరస్పర దాడులకు దిగారు.
ఈ గొడవలను అదుపు చేసేందుకు కళాశాలకు చెందిన ప్రొఫెసర్ సయ్యద్ ముస్తాక్ అహ్మద్ ప్రయత్నించినా వినలేదు. ఈ ఆందోళన, పరస్పర దాడుల ఘటన అంతా కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపైనే జరగడం గమనార్హం. ఈ ఘటనతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. కళాశాలలో విద్యార్థుల మధ్య తలెత్తుతున్న వివాదాలను, గొడవలను నివారించడంలో అధ్యాపక కళాశాల యాజమాన్యం వైఫల్యంతో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి దాడులు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 12న ఎస్సార్ యూనివర్సిటీలో దీప్తి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దీప్తి హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీప్తి ఆత్మహత్యకు వివిధ కారణాలు వినిపించినా ఎస్సార్ యూనివర్సిటీలోని హాస్టల్ నిర్వాహకుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇది జరిగిందన్న అభిప్రాయం తోటి విద్యార్థుల నుంచి వ్యక్తమైంది.
మళ్లీ గంజాయి కలకలం..!
ఎస్సార్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హాస్టల్ గదుల్లో ప్యాకెట్లు లభించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఎస్సార్ యూనివర్సిటీ హాస్టల్ గదుల్లో విద్యార్థులు దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను నార్కోటిక్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారని గురువారం పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన యూనివర్సిటీకి వెళ్లిన నార్కోటిక్ పోలీసుల బృందం దాడులు చేసి ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ గదుల్లో సోదాలు చేసిన నార్కోటిక్ పోలీసులు నిల్వ ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తాగుతూ పట్టుబడ్డ విద్యార్థులను నార్కోటిక్ బ్యూరో పోలీసులు హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. క్యాంపస్‌లో విద్యార్థులు గంజాయి తాగుతూ అడ్డంగా పట్టుబడటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే విద్యార్థులకు గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు. ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది.. అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు గంజాయి ఎలా చేరింది? సిబ్బంది సహకారం లేకుండా సాధ్యమైందా..? ఎన్నాళ్ల నుంచి జరుగుతోంది..? ఎవరెవెరు సహకరిస్తున్నారనే కోణాల్లో విచారణ జరుగుతున్నట్లు సమాచారం.