- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లల పార్కులో ప్రైవేటు వ్యాపారం
దిశ, హన్మకొండటౌన్: హన్మకొండ బాల సముద్రంలోని చిల్డ్రన్ పార్కు మున్సిపల్ ఉద్యోగుల అక్రమార్జనకు వనరుగా మారింది. పిల్లలు, పెద్దలు సేదతీరేందుకు తీర్చిదిద్దిన ఆహ్లాదకరమైన ఈ పార్కులో షూటింగ్‌ల సందడి కొనసాగుతుండడం గమనార్హం. జీడబ్ల్యూఎంసీ చీఫ్ హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్ అనుమతిచ్చారని సిబ్బంది చెబుతుండగా అబ్బే అదేం లేదని దిశకు వివరణ ఇచ్చారు. ఈ విషయమే తన దృష్టికి రాలేదంటూ చెప్పడం గమనార్హం. వెంటనే ఎంక్వయిరీ చేయిస్తున్నానని చెప్పారు. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పార్కులో ఈ అక్రమ వసూళ్లపై దిశకు సమాచారం అందింది. దీంతో గురువారం ఉదయం పార్కును సందర్శించగా అనధికారిక వసూళ్లు, షూటింగ్‌ల సందడి వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆరా తీస్తే ఎటువంటి అనుమతుల్లేకుండానే షూటింగ్‌ల నిర్వహణ జరుగుతోందన్న విషయం స్పష్టమైంది.
అసలేం జరుగుతోందంటే..
పార్కుకు ఉదయం 6 నుంచి 9 గంటలకు వరకు వాకర్స్ వాకింగ్ చేసి వెళ్లాక పార్క్ సిబ్బంది గేట్లకు తాళాలు వేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు సామాన్య ప్రజలకు పార్కులోకి ఎంట్రీ లేదు. ఈ ఎంట్రీ లేని సమయాన్ని ప్రైవేట్ వ్యక్తులు తమకు అనుగుణంగా మలుచుకుని బేబీస్ బర్త్ డేలు, మెటర్నటీ షూట్లు, ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ తదితర ప్రోగ్రాంలు చేస్తూ పెట్టుబడి లేకుండా లాభాలు అర్జిస్తున్నారు. వాస్తవానికి పార్కులో ఇటువంటి షూట్‌లకు అనుమతి లేదు, ఇవ్వకూడదు కూడా. అయితే అందుకు విరుద్ధంగా పార్కు బాధ్యతల్లో ఉన్న మున్సిపల్ ఉద్యోగులు అనధికారికంగా ఫీజుల రూపంలో వసూళ్లు చేస్తూ జేబులో వేసుకుంటుండడం గమనార్హం. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. ఒక ఫొటోషూట్‌కు రూ. వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పుచ్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ విషయంపై పార్క్ సిబ్బందిని దిశ వివరణ కోరగా తమకేం తెలియదంటూ దాటవేశారు. ఫొటో షూట్లకు సీహెచ్ఓ శ్రీనివాస్ సార్ పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. పర్మిషన్ కాపీ చూపెట్టమని అడుగగా.. ఏదైనా ఉంటే మున్సిపల్ ఆఫీసులో అడగండి అంటూ చెప్పడం విశేషం. ఈ విషయమై సీహెచ్‌ఓను ఫోన్‌లో సంప్రదించగా మేము ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని వెల్లడించారు. మరి పబ్లిక్ పార్కులో యథేచ్ఛగా ఫొటోషూట్‌లు తీస్తుంటే చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించగా మా దృష్టికి ఈ విషయం రాలేదని చెప్పడం గమనార్హం. ఈ విషయమై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.