పట్టపగలే మాయం అవుతున్న మట్టి.. యథేచ్ఛగా అక్రమ తరలింపు

by Ramesh Goud |
పట్టపగలే మాయం అవుతున్న మట్టి.. యథేచ్ఛగా అక్రమ తరలింపు
X

అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు అక్రమ వ్యాపారులు ప్రభుత్వ భూమిలోని మట్టినీ వదలడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రివేళల్లో లారీల కొద్ది మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. హ‌న్మకొండ జిల్లా ధ‌ర్మాసాగ‌ర్ మండ‌లంలోని ఎల్కుర్తి గ్రామం నుంచి పెద్దఎత్తున మ‌ట్టి దందా జ‌రుగుతోంది. ఎల్కుర్తి రైతు వేదిక స‌మీపంలోని అసైన్డ్ భూమిలో మ‌ట్టి త‌వ్వకాలు అడ్డగోలుగా జ‌రుగుతున్నాయి. ఎల్కుర్తి, ధ‌ర్మాసాగ‌ర్ మండ‌ల‌కేంద్రానికి స‌మీపంలోని ప‌లు వెంచ‌ర్లలో ఇక్కడి నుంచి మ‌ట్టి ర‌వాణా చేస్తున్నారు. వెంచ‌ర్లలో మ‌ట్టి డంపులు క‌న‌బ‌డుతుండ‌డమే అందుకు నిద‌ర్శనంగా నిలుస్తోంది. ఎక్స్‌క‌వేట‌ర్లతో త‌వ్వకాలు జ‌రుపుతూ లారీల్లో, ట్రాక్టర్లతో హ‌న్మకొండ, వ‌రంగ‌ల్ శివారు ప్రాంతాల్లోని రియ‌ల్ వెంచ‌ర్లకు త‌ర‌లిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో మట్టిని అమ్ముకుని వ్యాపారులు రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. అర్ధరాత్రి దాటిందంటే లారీల కొద్దీ మట్టి తరలిపోతోంది. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. మట్టి దందాలో యజమానులు అధికారుల చేతులు తడిపారని, అందుకే పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

దిశ, హ‌న్మకొండ : అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు వ్యాపారులు ప్రభుత్వ భూమిలోని మట్టిని కూడా వదలడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రివేళల్లో లారీల కొద్ది మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. హ‌న్మకొండ జిల్లా ధ‌ర్మాసాగ‌ర్ మండ‌లంలోని ఎల్కుర్తి గ్రామం నుంచి పెద్దఎత్తున మ‌ట్టి దందా జ‌రుగుతోంది. ఎల్కుర్తి రైతు వేదిక స‌మీపంలోని అసైన్డ్ భూమిలో మ‌ట్టి త‌వ్వకాలు జ‌రుగుతున్నాయి. ఎల్కుర్తి, ధ‌ర్మాసాగ‌ర్ మండ‌ల‌కేంద్రానికి స‌మీపంలోని ప‌లు వెంచ‌ర్లలో ఇక్కడి నుంచి మ‌ట్టి ర‌వాణా జ‌రుగుతోంది. మ‌ట్టి డంపులు కూడా వెంచ‌ర్లలో క‌న‌బ‌డుతుండ‌డం మ‌ట్టి దందాకు నిద‌ర్శనంగా నిలుస్తున్నాయి. కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఎక్స్‌క‌వేట‌ర్లతో త‌వ్వకాలు జ‌రుపుతూ లారీల్లో, ట్రాక్టర్లతో హ‌న్మకొండ, వ‌రంగ‌ల్ శివారు ప్రాంతాల్లోని రియ‌ల్ వెంచ‌ర్లకు త‌ర‌లిస్తున్నారు. గృహ నిర్మాణాల‌కు పెద్దఎత్తున కాంట్రాక్టులు తీసుకుంటూ రాత్రివేళ‌ల్లో తోల‌కాలు జ‌రుపుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్రభుత్వ అసైన్డ్ భూమిలో మట్టిని అమ్ముకుని వ్యాపారులు రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. అర్ధరాత్రి దాటిందంటే లారీల కొద్దీ మట్టి తరలిపోతోంది. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. మట్టి దందాలో యజమానులు అధికారుల చేతులు తడిపారని, అందుకే పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సదరు అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రమట్టికి భలే డిమాండ్‌..

ధ‌ర్మాసాగ‌ర్ మండ‌లంలోని ప‌లు గ్రామాల్లో ఎర్రమ‌ట్టి ల‌భ్యత ఎక్కువ‌గా ఉంటుంది. ఇది వెంచ‌ర్లకు ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌డంతో అక్రమార్కులు అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో త‌వ్వకాల‌కు తెగ‌బ‌డుతున్నారు. రెవెన్యూ అధికారులు స‌హ‌క‌రిస్తుండ‌డంతోనే ఈ దందా య‌థేచ్ఛగా సాగుతోంద‌న్న విమ‌ర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎర్రమట్టికి మంచి డిమాండ్‌ ఉండడంతో కొందరు అక్రమార్కులు మట్టి వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. లారీ లోడ్‌ సుమారు రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ధర పలుకుతోంది. దీంతో మట్టి మాఫియా నగర శివారు ప్రాంతమైన ధ‌ర్మాసాగ‌ర్‌ మండలాన్ని ఎంచుకుంది. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో నెలల తరబడి మట్టిని తవ్వడంతో అక్కడ భారీ గుంతలు ఏర్పడ్డాయి. గ్రామ సమీపంలో ఏర్పడిన గుంతలు వర్షాకాలంలో నిండి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో నిండిన నీటిలో పిల్లలు పడి మృత్యువాత పడే ప్రమాదముందని గ్రామస్తులు వాపోతున్నారు.

మట్టి మీద మాకు అధికారం లేదు..

ఏలుకుర్తి గ్రామంలో జరుగుతున్న మట్టి అక్రమ దందాకు సంబంధించిన అనుమతుల విషయంలో తమకు అధికారం లేదు. ఈ విషయంపై గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఎవరు పట్టించుకోలేదని ఏలుకుర్తి పంచాయితీ కార్యదర్శి భీంరాజ్ తెలిపారు.

Next Story

Most Viewed