- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యక్ష ప్రశ్నలతో ఎన్యూమరేటర్లు ఉక్కిరి బిక్కిరి
దిశ, మంగపేట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేలో పాల్గొంటున్న ఎస్జీటీలు అడిగే ప్రశ్నలకు ప్రజలు చుక్కలు చూపుతున్నారు. సవాలక్ష యక్ష ప్రశ్నలు వేయడంతో వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 9(శనివారం) నుంచి 18 వరకు జరిగే ఇంటింటి సమగ్ర సర్వేలో ఒక్కో ఎన్యూమరేటర్ 150 ఇళ్లను తిరిగి సర్వే చేస్తుండగా వారు అడిగే ప్రశ్నలకు భిన్నంగా ప్రజలు స్పందిస్తున్నట్లు ఎన్యూమరేటర్లు పేర్కొంటున్నారు. పక్క ఇల్లులు, ఆర్ సీసీ భవనాలు, పెద్ద బంగ్లాలు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు ఉన్నప్పటికీ వాటి వివరాలను ఇవ్వకుండా అవన్నీ ఎందుకండీ ఏదో ఒకటిరాసుకోక అంటూ వివరాలు ఇచ్చేందుకు విముఖత ప్రదర్శిస్తున్నారని చివరకు ఆధార్ నెంబర్ ఇవ్వడానికి సైతం ఆలోచిస్తున్నట్లు ఎన్యూమరేటర్లు తమ ఒక రోజు ఇంటింటి సమగ్ర సర్వేలో ఎదురైన అనుభవాలను వెల్లడించారు. ఆస్తులు, ఆదాయ మార్గాలున్నప్పటికీ ఇంటింటి సమగ్ర సర్వేలో చివరకు ప్రజలు ఇచ్చిన సమాచారమే ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో 9 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్ ఇంటింటి సమగ్ర సర్వే, 19 నుంచి 27 వరకు డాటా ఎంట్రీ, 27 నుంచి 30 వరకు ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నారు.
మండల సర్వేలో 70 మంది టీచర్లు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, కులగణన సర్వేలో మండల విద్యాశాఖ నుంచి 70 మంది ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. అందులో మండల పరిషత్ పాఠశాలలకు చెందిన 45 మంది, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 24 మంది, ఎం ఆర్ సి నుంచి ఒక్కరు పాల్గొంటుండగా ఇందులో 68 మంది ఎనిమరేటర్స్ గా ఇద్దరు ఉపాధ్యాయులు సూపర్వైజర్స్ గా పాల్గొంటున్నారు. వీరితో పాటు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు తమ సేవలను అందిస్తున్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలన
మండలంలో జరుగుతున్న ఇంటింటి సమగ్ర సర్వేను జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్ రావు శనివారం మండలంలో పర్యటించి సర్వేను పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి తుల రవి, ఎంపీడీవో భద్రు, ఎంపీవో కిషోర్ లతో కలిసి వాడగూడెం, రమణక్కపేట, మల్లూరు, కొత్తమల్లూరు, మంగపేట పంచాయతీలలో పర్యటించి ఎన్యూమరేటర్లకు ఎదురయ్యే ఇబ్బందులను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న సర్వేతో ప్రజలకు వారి ఆస్తులకు ఎలాంటి ఇబ్బందులుండవని తెల్ల రేషన్ కార్డులపై ఎలాంటి ప్రభావం ఉండదని నచ్చ చెప్పినట్లు తెలిసింది. మండలంలోని కొందరు ప్రజలు తమ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.