రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు ఎత్తేయండి: ఎమ్మెల్యే సీతక్క

by Kalyani |
రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు ఎత్తేయండి: ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, కొత్తగూడ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు ఎత్తేయాలని గురువారం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుల ప్రదర్శన నిర్వహించారు. రాజీవ్ గాంధీపై అనర్హత వేటు ఎత్తేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన పోస్ట్ కార్డులతో ర్యాలీగా బయలుదేరి పోస్ట్ బాక్స్ లో వేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దేశ సేవ కోసం కృషి చేస్తున్నా సాదా సీదా నాయకుడు రాహూల్ గాంధీపై అనర్హత వేటు వేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

భారత్ జోడో యాత్రతో రాహూల్ గాంధీకి మంచి స్పందన వచ్చిందని, దీంతో బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని ఈ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకు రాహూల్ గాంధీపై కుట్రపూరిత చర్యలను చేపడుతూ అనర్హత వేటు వేసిందన్నారు. నేరస్థుల కోసం దగాకోరుల కోసం రాహూల్ గాంధీపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని అన్నారు.

Advertisement
Next Story

Most Viewed