- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయండి..
దిశ, దేవరుప్పుల (పాలకుర్తి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీఎల్ఎన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు లేగ రామ్మోహన్ రెడ్డిలు డిమాండ్ చేశారు. బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బుధవారం దేవరుప్పుల, పాలకుర్తి మండల పార్టీల అధ్యక్షులు భాగాల నవీన్ రెడ్డి, కమ్మగాని శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆయా మండల ప్రధాన చౌరస్తాలలో రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగలో తొక్కి నిజాం నవాబులా నిరంకుశతత్వాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్, జిల్లా అధికార ప్రతినిధి చింత సృజన్, పట్టణ అధ్యక్షుడు దుంపల సంపత్, కొడకండ్ల మండల అధ్యక్షులు ఉపేందర్, ఓబీసీ మూర్చ మండల అధ్యక్షుడు పెనుగొండ సోమేశ్వర్, సోషల్ మీడియా కన్వీనర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.