- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీజ్
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా నడిపిస్తున్న ప్రైవేటు ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆధ్వర్యంలో శుక్రవారం సీజ్ చేశారు. లైఫ్ లైన్ మరియు రజిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేరుతో గారేపల్లి గ్రామంలోని చింతకాని ఎక్స్ రోడ్ వద్ద కొన్ని నెలలుగా నడిపిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు శుక్రవారం జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తనిఖీ చేశారు. కార్డులను పరిశీలించారు. ఈ హాస్పిటల్స్ రిజిస్టర్ కోసం దరఖాస్తు చేసుకోగా క్వాలిఫైడ్ డాక్టర్లు లేకపోవడంతో అనుమతి ఇవ్వలేదని, అందుకే ఫీజు చేసినట్లు జిల్లా వైద్యాధికారి వివరించారు. సీల్ తొలగించి ఆసుపత్రి నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రిజిస్టర్ కాబడిన 27 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని 13 ఆసుపత్రులపై కేసు నమోదు చేసినట్లు, జిల్లాలో అనుమతిలేని ఆసుపత్రుల నిర్వహణపై ప్రజలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి కొమురయ్య, జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీదేవి, కాటారం పీహెచ్ సీ డాక్టర్ రామారావు సిబ్బంది పాల్గొన్నారు.