- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేఎంసీలో పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ కేఎంసీ పీజీ వైద్యా విద్యార్థిని దరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. రెండో సంవత్సరం పీజీ చదువుతున్న ఓ విద్యార్థి వేధింపులతోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఎంజీఎంలోని వార్డులో విధుల్లో ఉండగానే ఆమె కుప్పకూలిపోయింది. తోటి విద్యార్థులు ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రీతి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తోటి పీజీ విద్యార్థుల ద్వారా తెలుస్తోంది. ప్రీతి స్వస్థలం హైదరాబాద్. తండ్రి నరేందర్ రైల్వే ఎస్ఐగా పనిచేస్తున్నారు.
నాలుగు రోజుల కిందటే ఏం జరిగిదంటే..?
విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం... పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పడంతో తండ్రి నరేంద్ వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో సదరు విద్యార్థిని పిలిచి మందలించారు. అయితే ఆ తర్వాత కూడా ప్రీతిని సదరు విద్యార్థి బెదిరింపులకు గురి చేశాడని తెలుస్తోంది. దీంతో మనస్తాపంతో ఉన్న ప్రీతి బుధవారం ఎంజీఎంలో వార్డులో విధులు నిర్వహిస్తుండగానే.. ఏదో మాత్రను మింగిన కొద్ది నిముషాల్లోనే ఆమె కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన ఇప్పుడు వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు.