Parakala MLA : పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేయాలి

by Aamani |
Parakala MLA : పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేయాలి
X

దిశ, నడికూడ: పరకాల,నడికూడ మండలాల పరిధిలోని మండల స్థాయి అధికారులు, అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు,పంచాయతీ కార్యదర్శులతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ధి ఆంజనేయులు, అధ్యక్షతన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు వారానికి రెండుసార్లు తప్పనిసరిగా గ్రామానికి వెళ్లి సమస్యలు గుర్తించి పరిష్కరించాలని అలా చేస్తే వారికి మంచి గుర్తింపు వస్తుందని లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కే వెంకట నారాయణ, తహసీల్దార్ ఏవి భాస్కర్, మండల స్థాయి అధికారులు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నడికూడ మండలం,లో జరిగిన సమీక్ష సమావేశంలో గ్రామాల వారి,గా జరిగిన మరియు జరగవలసిన అభివృద్ధి పనులపై వివిధ శాఖల వారీగా అధికారులతో చర్చించారు. గత సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అధికారులు నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని, ఉద్యోగ బాధ్యతను సామాజిక బాధ్యత అని పనిచేసినప్పుడే సంతృప్తి ఉంటుందని సూచించారు. గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా సత్వర చర్యలు చేపట్టి నడికూడ మండల అభివృద్ధి, కి తోడ్పడాలని వన మహోత్సవంలో భాగంగా ప్రతి మొక్కను సంరక్షించే విధంగా చర్యలు చేపట్టి వాటి యొక్క నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మండల సమావేశంలో నడికూడ ఎంపీడీవో చిర్ర బోయిన శ్రీనివాస్, ఎమ్మార్వో గుండాల నాగరాజు, ఎంపీ ఓ, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed