- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ సిలిండర్లను పట్టుకొన్న అధికారులు..
దిశ, హన్మకొండ: నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్స్, కర్రీ పాయింట్, టిఫిన్ సెంటర్స్ పై శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించి 38 సిలిండర్లను పట్టుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పి. వసంత లక్ష్మీ తెలిపారు. హన్మకొండ నాయిమ్ నగర్ నుంచి భిమారం వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించామని అన్నారు.
అందులో భాగంగా 11చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి, సంబంధిత షాపుల యజమానులపై '6 ఏ ' కేసులు నమోదు చేశామని చెప్పారు. హోటల్ యాజమానులు, వ్యాపారస్తులు కమర్షల్ సిలిండర్లు మాత్రమే వినియోగిచాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహాసీల్దార్లు యం.కృష్ణ, కే. సత్యనారాయణ, జే. రమేష్ తో పాటుగా సిబ్బంది సదానందం, ఐలయ్య, నవనీత్ తదితరులు పాల్గొన్నారు.