అక్రమ వెంచ‌ర్‌‌పై చర్యలుండ‌వా.. నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు

by Vinod kumar |
అక్రమ వెంచ‌ర్‌‌పై చర్యలుండ‌వా.. నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు
X

దిశ, హనుమకొండ టౌన్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్ పై అధికారులు వ‌ల్లమాలిన ప్రేమ‌ను వ‌ల‌క‌బోస్తున్నారు. అక్రమ లే అవుట్ నిర్వాహాకుడికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ర‌క్షణ‌గా నిలుస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఆత్మకూరులోని 869/B/2/2 సర్వే నంబర్లో ఎలాంటి అనుమ‌తుల్లేకుండా వెంచ‌ర్ నిర్మాణం జ‌రుగుతోంది. ఇదే విష‌యం ఎంపీవో చేతన్ కుమార్ రెడ్డి, కార్యదర్శి మేడ యాదగిరి కూడా క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి నిర్ధార‌ణ చేసుకున్నారు. పర్మిషన్స్ లేని వెంచర్ పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని చెప్పిన అధికారులు నోటీసులు కూడా జారీ చేసిన‌ట్లుగా వెల్లడించారు. ఇది జ‌రిగి నెల‌లు గ‌డుస్తున్నా అధికారుల చ‌ర్యలు మాత్రం కాన‌రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రో వైపు ప్లాట్ల అమ్మకాల‌కు నిర్వాహాకులు ప్రయ‌త్నాలు సాగిస్తుంటం గ‌మ‌నార్హం. ఇదంతా అధికారుల‌కు తెలిసినా చ‌ర్యలు తీసుకోక‌పోవడంపై అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి.

ఈ వెంచ‌ర్‌పై ఎందుకంత ప్రేమంట‌..!?

ఆత్మకూరు మండల కేంద్రంలో 869/B/2/2 సర్వే నంబర్లో ఏర్పాటు చేసిన వెంచ‌ర్‌కు అధికారుల అండ‌దండలున్నట్లుగా స్పష్టమ‌వుతోందన్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ వెంచ‌ర్‌పై మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నా ప‌ట్టింపు లేన‌ట్లుగా వ్యవ‌హ‌రిస్తుండ‌టం వారి మొండి వైఖ‌రిని బ‌య‌ట‌పెడుతోంది. హ‌న్మకొండ ఆర్డీవో వాసుచంద్రతో పాటు ఉన్నతాధికారులు దృష్టిపెట్టాల‌ని మండ‌ల ప్రజ‌లు కోరుతున్నారు.

అదే ముచ్చట మ‌ళ్లీ మ‌ళ్లీ..

అక్రమ వెంచ‌ర్ నిర్మాణం విష‌యంపై గ‌తంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా చ‌ర్యలు తీసుకుంటామ‌ని వెల్లడించారు. తాజాగా మ‌రోసారి 'దిశ' రిపోర్టర్ వెంచ‌ర్‌పై చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలేంట‌ని ఎంపీఓ చేతన్ కుమార్ రెడ్డిని వివ‌ర‌ణ కోర‌గా ఆయ‌న స్పందించారు. ఈనెల 2న వెంచర్ యాజమానులకు నోటీస్ లు జారీ చేయాల‌ని ఆత్మకూరు గ్రామ పంచాయ‌తీ కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేసిన‌ట్లు చెప్పారు. కార్యదర్శి మేడ యాదగిరిని వివరణ కోరగా అక్రమ వెంచర్ చేస్తున్న యజమానులకు సోమవారం నోటీసులు జారీ చేశామ‌ని, అయితే కుటుంబ స‌భ్యులుగానీ, సంబంధీకులు గాని ఇంటి వ‌ద్ద లేర‌ని, త్వర‌లోనే నేరుగా క‌లిసి అంద‌జేస్తామ‌ని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed