నూతన డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం

by Kalyani |
నూతన డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం
X

దిశ, తొర్రూరు:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బస్టాండ్ పక్కన గణేష్ డయాగ్నస్టిక్స్, దంత వైద్యశాల సెంటర్ ను,..పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ, "ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం ఈ డయాగ్నస్టిక్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఆధునిక వైద్య పరికరాలు, నిపుణుల సేవల ద్వారా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యం" అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలు త్వరితగతిన ఆరోగ్య పరీక్షలు చేసుకునే అవకాశం పొందాలని ఝాన్సీ రెడ్డి అభిప్రాయపడ్డారు.

డాక్టర్ స్పందన మాట్లాడుతూ...

సొంత ఊరిలో ఆసుపత్రి ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేసిన డాక్టర్ స్పందన...తొర్రూరులో నూతనంగా ప్రారంభమైన గాంధీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ స్పందన మాట్లాడుతూ, "సొంత ఊరిలో ఆసుపత్రి ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే మా ప్రధాన లక్ష్యం. ఈ హాస్పిటల్ పేద ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాము" అని అన్నారు. ఆమె స్పందన పేర్కొంటూ, "గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయిల వరకు అన్ని రకాల అత్యవసర వైద్య సేవలు అందించాలనే ధ్యేయంతో ఈ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రాంత ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడంలో కీలకంగా మారుతుంది" అని పేర్కొన్నారు. ప్రాంత ప్రజలు ఈ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, వైద్య నిపుణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed