Swiggy: జొమాటోకు పోటీగా స్విగ్గీ నుంచి సరికొత్త యాప్ లాంచ్..!

by Maddikunta Saikiran |
Swiggy: జొమాటోకు పోటీగా స్విగ్గీ నుంచి సరికొత్త యాప్ లాంచ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ(Swiggy) తమ యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్విక్‌ కామర్స్‌(Quick Commerce) రంగంలో దూసుకుపోతున్న ఆ సంస్థ తాజాగా కొత్త సర్వీసులను ప్రారంభించిది. డైనింగ్‌, లైవ్ ఈవెంట్స్‌, టికెట్‌ బుకింగ్‌ల కోసం ప్రత్యేకమైన యాప్ తీసుకొచ్చింది. 'సీనెస్(Scenes)' పేరుతో దీన్ని లాంచ్ చేసింది. కస్టమర్లు ఈ యాప్ ద్వారా పార్టీలు, లైవ్ మ్యూజిక్, డీజే నైట్స్‌, రెస్టారెంట్లలో జరిగే ఈవెంట్ల కోసం టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం ఈ యాప్ సేవలను కేవలం బెంగళూరు(Bengaluru) లోనే స్టార్ట్ చేస్తున్నామని, త్వరలోనే మరిన్ని నగరాలకు దీన్ని విస్తరిస్తామని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త తరహా సేవల ద్వారా సంస్థ ఆదాయం(Income) మరింత పెరుగుతుందని, యూజర్ల సంఖ్యను పెంచుకోవడంలో ఈ యాప్ సహాయపడుతుందని పేర్కొంది. కాగా ఇటీవలే జొమాటో కూడా 'డిస్ట్రిక్ట్(District)' అనే యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు స్పోర్ట్స్, మూవీస్, లైవ్ ఈవెంట్స్ వాటికి టికెట్ బుకింగ్స్ చేసుకోవచ్చు. స్విగ్గీ ఈ విభాగంలో పోటీని ఎదుర్కొనడానికి తాజాగా 'Scenes' యాప్‌ను ప్రారంభించింది.

Advertisement

Next Story