SS Rajamouli : డ్యాన్స్ తో అదరగొట్టిన రాజమౌళి దంపతులు

by M.Rajitha |
SS Rajamouli : డ్యాన్స్ తో అదరగొట్టిన రాజమౌళి దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Director Rajamouli), తన భార్య రమా రాజమౌళి(Rama Rajamouli)తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఇంతకీ ఆ దంపతులు అంత హుషారుగా స్టెప్పులు ఎందుకు వేశారో తెలుసా..? రాజమౌళి బంధువైన ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి(MM Keeravani) ఇంట్లో పెళ్లి శుభకార్యం జరుగుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న చిన్న కుమారుడు శ్రీ సింహా(Sri Simha), సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ (Murali Mohan) మనవరాలు రాగ మాగంటి (Raaga Maganti)ని వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరగగా.. పెళ్లి దుబాయ్‌(Dubai)లో గ్రాండ్ గా జ‌ర‌గబోతోంది. ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌(Pre Wedding Celebrations)లో భాగంగా.. సంగీత్(Sangeeth) వేడుక‌లో ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి, తన భార్యతో కలిసి డాన్స్‌ చేసి అల‌రించాడు. అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమాలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాట‌కు రాజ‌మౌళి దంప‌తులు క‌లిసి స్టెప్పులేశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే రాజ‌మౌళి త‌న భార్యతో క‌లిసి సరదాగా డాన్స్ చేయ‌డంతో.. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed