నిరుపేద విద్యార్థుల భవిష్యత్​ను బంగారంలా తీర్చిదిద్దుతాం

by Sridhar Babu |
నిరుపేద విద్యార్థుల భవిష్యత్​ను బంగారంలా తీర్చిదిద్దుతాం
X

దిశ, తిరుమలగిరి : నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్​ను బంగారుమయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, 8 సంవత్సరాల తర్వాత డైట్ మెనూ చార్జీలు 40 శాతం పెంచి, కాస్మోటిక్ కోసం 200 శాతం పెంపొందించినట్లు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ లోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, వసతి గృహాన్ని మంత్రి ఉత్తమ్, కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీగణేష్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గురుకుల పాఠశాలలో నూతనంగా కామన్ డైట్ మెను ను ప్రారంభించారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి స్వయంగా పాఠశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అధికారులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 25 లక్షల రూపాయలు ప్రకటించారు. డైట్, మెనూ, కాస్మెటిక్స్ పెంపు మూలంగా ప్రభుత్వానికి 470 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని వెల్లడించారు. గురుకులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed