సీకేఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీలకు స్కానింగ్ చేయడానికి కరువైన సిబ్బంది

by Aamani |
సీకేఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీలకు స్కానింగ్ చేయడానికి కరువైన సిబ్బంది
X

దిశ,వరంగల్ : వరంగల్ ఉమ్మడి జిల్లాకే పెద్ద దిక్కు అయిన వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోజు 200 నుండి 300 మంది ఓపీ పేషెంట్లు వచ్చే ఈ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సికేం ఆస్పత్రిలో పనిచేసిన ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ (రేడియాలజిస్ట్) లలో ఒకరు రాయపర్తికి, మరొకరు కమలాపూర్ పీహెచ్సీలకు రెండు నెలల క్రితం బదిలీ అయ్యారు. కాగా వీరి స్థానాలు నేటి వరకు కూడా భర్తీ భర్తీ కాలేదు. ప్రస్తుతం ఒక పీజీ మామూలు స్కానింగ్ మాత్రమే తీస్తున్నారు. దీంతో పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

స్కానింగ్ సెంటర్ల వద్ద గర్భిణి స్త్రీలు గంటలకు వేచి చూడాల్సి వస్తుంది. ఇంత సమయం ఎందుకు పడుతుందని గర్భిణీ స్త్రీల బంధువులు అక్కడ విధులు నిర్వహించే ఆస్పత్రి సిబ్బందిని అడగగా ఈ ఆసుపత్రిలో స్కానింగ్ తీసే వారు లేరని, మీరు బయట ఏదైనా ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలలో వెళ్లి తీసుకుంటే మంచిదని సలహాలిస్తున్నారని గర్భిణీ స్త్రీల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద సామాన్య ప్రజలే ఈ ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారు. వారిని ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలలో స్కానింగ్ తీపించుకోవాలంటే దిక్కుతోచని స్థితిలో ఆసుపత్రిలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సీఎం ప్రసూతి ఆసుపత్రి పై చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని, తరచూ ఏర్పడుతున్న సమస్యలను నిర్మూలించాలని గర్భిణీ స్త్రీలు బంధువులు స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed