అనుదీప్ శర్మకు జాతీయ నంది పురస్కారం..

by Sumithra |
అనుదీప్ శర్మకు జాతీయ నంది పురస్కారం..
X

దిశ, శాయంపేట : హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలోని పెద్దకోడపాక గ్రామంలోని రాజరాజేశ్వరాలయం అర్చకులు అనుదీప్ శర్మ వేద వైదిక పురోహిత భాస్కర బిరుదుతో పాటు, ఉత్తమ జాతీయ నంది పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ పట్టణంలోని శ్రీ త్యాగరాయ గానసభ సమావేశ మందిరంలో శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో శోభకృత నామ ఉగాది పురస్కార మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని 12 మంది అర్చకులను ఉత్తమ జాతీయ నంది పురస్కారంతో సత్కరించారు. హిందూ సంప్రదాయాలను అభివృద్ధి చేయడంలో, ఆలయాల అభివృద్ధి, ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న పురోహితులను ఎంపిక చేసి సత్కరించారు.

పెద్దకొడేపాకకు చెందిన తాటిపాముల అనుదీప్ శర్మ కాకతీయ కాలంలో నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాక, కాల సర్ప దోషాలకు ప్రత్యేక పూజలు చేస్తూ, ఆలయాల్లో చేస్తున్న సేవలు గుర్తించి వేదవైదిక పురోహిత భాస్కర బిరుదుతో పాటు, ఉత్తమ జాతీయ నంది పురస్కారాన్ని తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, బీజేఎంఎంఈసీ మెంబర్, లుంప్రో సీఈవో రూప సుధాకర్ రెడ్డి, జనగాం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ రెడ్డి, మల్కాజ్ గిరి కోర్టు మెజిస్ట్రేట్ బూర్గుల మధుసూదన్ రావు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి గొల్ల కృష్ణ, చిట్టి రామశర్మ చేతుల మీదుగా అందజేశారు. జాతీయ నంది పురస్కారం అందుకున్న అనుదీప్ శర్మను స్థానిక సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, ఎంపీటీసీలు వావీలాల వేణుగోపాల ప్రసాద్, మాచర్ల మంగమ్మ రవి, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అమ్మ అశోక్, పురోహితులు పల్నాటి జలంధర్, పలువురు నాయకులు, గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed