నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతున్నాడు..: కడియం కావ్య

by Disha Web Desk 23 |
నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతున్నాడు..: కడియం కావ్య
X

దిశ,హనుమకొండ టౌన్ : నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతున్నాడు అని, దళితులు, పేదలు, క్రిస్టియన్ లు, ముస్లింలు, మహిళలు అంటే గిట్టదు అని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. సోమవారం హనుమకొండ అసుంత భవన్ లో ఏర్పాటు చేసిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దాల్వీ, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి , వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , వర్ధన్నపేట శాసన సభ్యులు కె.ఆర్ నాగరాజు లతో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. ఇన్నాళ్లు మన అందరిని అంబేద్కర్ కాపాడారు. ఇప్పుడు అంబేద్కర్ ను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని, ప్రజలకు స్వేచ్ఛ, రిజర్వేషన్లు ఉండాలి అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అన్నారు.

రాహుల్ గాంధీ విద్వేషక వాతావరణంలో ప్రేమను పంచుదాం అంటున్నారు. నరేంద్ర మోడీ దేశాన్ని విచిన్నం చేస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతూ మనుషుల్ని కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడదీసి రాక్షస పాలన సాగిస్తున్నాడు అని , నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతున్నాడు, దళితులు, పేదలు, క్రిస్టియన్ లు, ముస్లింలు, మహిళలు అంటే గిట్టదు అని, ఈ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పి మన రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలి అన్నారు. రాహుల్ గాంధీ మాత్రమే భారతదేశాన్ని ప్రగతి బాటలో ముందుకు నడుపుతారు అని, బి.ఆర్ అంబేద్కర్ శక్తి ఏంటో మనం చూపించాలి అని, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు. శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పాలనల రాజ్యాంగం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నాయి అని, మాలలకు సరైన న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అన్నారు. రాష్ట్ర ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతు తెలపాలని అన్నారు.

అంబేద్కర్ ను అవమాన పరిచే విధంగా బీజేపీ తీరు ఉంది అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే మన జీవితాలకు వెలుగులు వచ్చాయి, ఇప్పడు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే బావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నారు. అంబేద్కర్ బాటలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అని, కాంగ్రెస్ పార్టీని బలపరిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అన్నారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఇవి మన భవిష్యత్తును మార్చబోయే ఎన్నికలు, మన భవిష్యత్తు మన చేతిలో ఉంది అన్నారు. మాలాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, అంబేద్కర్ బాటలో నడిచి మనం అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి అన్నారు. కడియం శ్రీహరిని ఎవరు కోనలేరు, కొనే దమ్ము ఎవరికీ లేదు అని, కడియం శ్రీహరి ఎప్పుడు తప్పు చేయడు, తలవంచడు అని మాట్లాడారు. మన భవిష్యత్ ను మనం కాపాడుకుందాము అని, కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed