- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బులు ఇస్తేనే శవాన్ని ఇస్తాం.. కార్పొరేట్ వైద్యుల నిర్వాకం..
దిశ, జనగామ : కార్పొరేట్ వైద్యులు డబ్బులకోసం శవాన్ని ఇవ్వకుండా మెలిక పెట్టారు. రూ. 4 లక్షలు కడితే గాని డెడ్ బాడీని అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నాయకుడు నాగపూర్ కిరణ్ గౌడ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో మాట్లాడి మృతుడి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించేలా కృషి చేశారు. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద టి.ప్రవీణ్ గతకొద్ది కాలంగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాదులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు.
ఆసుపత్రికి బకాయిపడిన రూ. 4 లక్షలు చెల్లించాలని, లేకపోతే శవాన్ని ఇవ్వలేమని ఆసుపత్రి యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో వారు ఇబ్బందుల్లో ఉండగా కిరణ్ కుమార్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అనేక సందర్భాల్లో ఆపదలో ఉన్నవారికి నాగపురి కిరణ్ ఎంతో కృషి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం వారసుడిగా, అనేక సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకుంటున్నారు. మృతదేహాన్ని ఇప్పించేందుకు దూరం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, ఆ గ్రామ మాజీ సర్పంచ్ సింగరయ్య, స్థానికులు కొండయ్య, ప్రశాంత్, బిక్షపతి తదితరులు నాగపురి కిరణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.