- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దండు పాళ్యం ముఠాగా బీఆర్‌ఎస్.. ఎంపీ రేవంత్ రెడ్డి
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దండు పాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి అభివర్ణించారు. వరంగల్, పశ్చిమ ఎమ్మెల్యే నరేందర్, వినయ్ భాస్కర్ బిల్లా రంగాల్లా పోటీపడి మరీ భూ కబ్జాలు చేస్తూ దోచుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. కేసీఆర్ కట్టిస్తామన్న డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వలేదు. తొమ్మిదేళ్లయినా అమరుల స్థూపం నిర్మాణం పూర్తికాలేదన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఇప్పటికీ పూర్తికాలేదన్నారు. కేసీఆర్ హామీలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుందని అన్నారు. కానీ ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్నారు. వరంగల్ ఏకశిల పార్కు తాగుబోతుల అడ్డాగా మారిందని, కాళోజి కళా క్షేత్రం మొండిగోడలతో నిలబడ్డదన్నారు. దండుపాళ్యం ముఠాకు హన్మకొండ సాక్షిగా హెచ్చరిక చేస్తున్నా.. రోజులు లెక్కపెట్టుకోండి.. గోడమీద రాసి పెట్టుకోండి.. దండుపాళ్యం ముఠాకు ఇంతకింత మిత్తితో సహా చెల్లిస్తామంటూ రేవంత్ రెడ్డి హెచ్చరిక చేశారు.
ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి.. అధికారులు నిబంధనలకు లోబడి పని చేయాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సోమవారం రాత్రి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగింది. హన్మకొండ పెట్రోల్ పంపు, కలెక్టరేట్ బంగ్లా, బాల సముద్రం, ప్రెస్‌క్లబ్ మీదుగా హన్మకొండ చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది. హన్మకొండ చౌరస్తాలో జరిగిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ ఎస్‌పై ఓరుగల్లు నివురుగప్పిన నిప్పులా ఉందని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. బీఆర్ ఎస్ పాలనపై రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. ఏనుమాముల మార్కెట్ దళారుల పాలైందని, రైతులు తమ గోడు వినిపించారన్నారు. బీఆర్‌ఎస్ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. బాధితులే స్వయంగా తనకు తెలియజేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. గడిచిన తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగిపోయాయని అన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారిందన్నారు. వరంగల్ పసునూరు దయాకర్ పసిపిల్లాడనుకుంటున్నారు. కానీ టైర్ల ఫ్యాక్టరీని మూసివేసి హంటర్ రోడ్డు సెంటర్లో 6 ఎకరాల భూమిని కబ్జా చేసిండని అన్నారు. వరంగల్ జిల్లాలో ఏ ఎమ్మెల్యే ను తీసుకున్నా ఉద్యమంలో వీరి దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు వేల కోట్లకు పరిగెత్తారు. కేసీఆర్ కు టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. ఇవన్నీ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే. ఎంత కాలం వీరిని భరిద్దాం. దీనికి మందు లేదా. ఎన్నికల్లో కేసీఆర్.. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, రైతుకు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంది.
వీటిల్లో ఏదైనా తీరిందా అంటూ ప్రశ్నించారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధించిన దండుపాళ్యం ముఠాకు ఇంతకింత మిత్తి తో సహా చెల్లిస్తాం. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. అధికారులు నిబంధనలకు లోబడి పని చేయాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్యలు తప్పవు. ప్రభుత్వ ఉద్యోగాలకు పీఆర్సీ, బోనస్ ఇచ్చింది మేము. రాజస్థాన్, చత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ప్రజల్లో మార్పు వచ్చింది. పాలకుల్లో మార్పు రావాలి. కాంగ్రెస్ నాయకులం అంతా కలిసే ఉన్నాం. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి పార్టీ కార్యకర్త పని చేయాలన్నారు.
కాజీపేట దర్గా సందర్శన..
పాదయాత్రకు ముందు కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గాను దర్శించుకొని రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. చారిత్రక కాజీపేట దర్గాను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ దర్గాను దర్శించి ప్రభుత్వం తరపున గిలాఫ్ ఈ చదర్ సమర్పిస్తాం. ప్రతీ సంవత్సరం ఎమ్మెల్యే ల అభివృద్ధి నిధుల్లో 25 శాతం మైనార్టీల అభివృద్ధికి కేటాయిస్తామన్నారు.