ఉద్యోగాల పేరిట డబ్బు వసూళ్లు.. వ్యూహాత్మకంగా పట్టుకున్న నవోదయ ఏజెన్సీ

by Nagam Mallesh |   ( Updated:2024-08-16 10:33:09.0  )
ఉద్యోగాల పేరిట డబ్బు వసూళ్లు.. వ్యూహాత్మకంగా పట్టుకున్న నవోదయ ఏజెన్సీ
X

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో ఔట్ సోర్సింగ్ నియామకాల భర్తీ రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు ఏజెన్సీ పేరుతో నకిలీ ఏజెంట్లు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో కలెక్టర్ విచారణ జరిపించగా నిజమే అని తేలింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెపుతూ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిని నవోదయ ఏజెన్సీ నిర్వాహకులు వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకోగా, మరొక మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం. పట్టుకున్న ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తు అనంతరం తేలనుంది.

వారం కిందట కొందరు వ్యక్తులు నవోదయ ఏజెన్సీకి వచ్చారు. ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెన్సీ పేరుతో డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. వారి దగ్గర నుండి ఫోన్ నంబర్లు తీసుకున్నాను. మూడు రోజుల నుండి జాబ్ ఇప్పించాలని ప్రాధేయపడగా శుక్రవారం మధ్యాహ్నం కలిసేందుకు ఒప్పుకున్నారు. మొదట మెడికల్ కాలేజీ దగ్గరికి రమ్మన్నారు. అంబేడ్కర్ సెంటర్ కి రమ్మన్నారు. జాబ్ కోసం మాట్లాడి రూ.10వేలు ఇచ్చాను. నా మిత్రులు వచ్చి పట్టుకునే లోపు ఓ మహిళ పారిపోయింది. ఇద్దరు దొరికారు. వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాము.

కుమార్, నవోదయ నిర్వాహకులు

Advertisement

Next Story