- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం: MLA Seethakka
దిశ, కొత్తగూడ: నవ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క అన్నారు. కొత్తగూడ మండల కేంద్రంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కొత్తగూడ, గంగారం మండల అధ్యక్షులు ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ... రాజకీయాల్లోకి యువత రావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయాల బలోపేతానికి యువతే కీలకమని, మార్పు యువతతోనే సాధ్యమన్నారు. నియోజకవర్గంలో రాజకీయ పక్షాళన చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్తగూడ, గంగారం మండల నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా మండల అధ్యక్షులుగా బానోత్ వినోద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా బానోత్ వినోద్ కుమార్ మాట్లాడుతూ... తమపై నమ్మకంతో మండల బాధ్యతలు అప్పచెప్పినందుకు ఎమ్మెల్యే సీతక్కకు చల్లా నారాయణరెడ్డి, మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, జడ్పీటీసీ పులుసం పుష్పలత శ్రీనివాస్, ఎంపీపీ బాణోత్ విజయ రూప్ సింగ్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకరబోయిన మోగిలి, జిల్లా నాయకులు లావణ్య వెంకన్న, మాజీ జడ్పీటీసీ కందిమల్ల మసుధన్ రెడ్డి, ముస్కు వెంకన్న, బిట్ల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. మండలంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ యుఐ) నిరంతరం శ్రమిస్తూ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.