జేపీఎస్ లపై ఎమ్మెల్యే ఫైర్..

by Sumithra |   ( Updated:2023-06-09 14:51:00.0  )
జేపీఎస్ లపై ఎమ్మెల్యే ఫైర్..
X

దిశ, డోర్నకల్ : మిషన్ భగీరథ త్రాగునీటి సమస్య పై ఎమ్మెల్యే రెడ్యానాయక్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయించారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఇంట్రగ్రేడ్ అధికారులను, పలువురు కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం వహించే సెక్రెటరీల పనితీరు మెరుగుపర్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ అపర్ణ ను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. గ్రామ సెక్రెటరీలు పనితీరు మెరుపరుచుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. సర్పంచుల ద్వారా స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలు నాయక్, ఎంపీడీవో అపర్ణ, మండలాధ్యక్షుడు నున్నారమణ, చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, అధికారులు, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story