మెడికల్ క్యాంపులు పెట్టాలిః కలెక్టర్ అద్వైత్ కుమార్

by Nagam Mallesh |
మెడికల్ క్యాంపులు పెట్టాలిః కలెక్టర్ అద్వైత్ కుమార్
X

దిశ, గూడూరు : గురుకుల పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, తదితర సౌకర్యాల గురించి మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. గూడూరు మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. గూడూరులో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల బాలికలు, బాలుర వసతి గృహాలను తనిఖీ చేసి అక్కడి విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు. హాస్టల్స్ లో స్టడీ రూమ్, డైనింగ్ హాల్, వంట గదులను తనిఖీ చేశారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. షెడ్యూలు ప్రకారం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వసతి గృహంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్ధిని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధనలు అందించాలని అన్నారు. అనంతరం గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసి ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు జ్వరాల నమోదు వివరాలు కలిగిన రిజిస్టర్లను తనిఖీ చేశారు సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు, హాస్పటల్ కు చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడుతూ వారికి అందిస్తున్న వైద్య సేవలు గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇంచార్జి తహసిల్దార్ కోమల, ఎంపీడీవో వీరస్వామి, ఎంపీఓ సత్యనారాయణ. డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ స్రవంతి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed