- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Medak MP : సభ్యత్వ నమోదు ఓ సైద్ధాంతిక ఉద్యమం..
దిశ, వరంగల్ : విశేష్ సంపర్క్ అభియాన్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాకు విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ లను భద్రకాళి అమ్మవారి ఆలయంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం నగరంలోని పలు వ్యాపారవేత్తలు, వైద్యులు, సంఘ పెద్దలు, పలు ప్రముఖులను, 18, 34, 35, 36 డివిజన్ లలో పలువురిని కలిసి సభ్యత్వ నమోదు చేపించారు. మాట్టేవాడ ఎస్ఎస్కె సమాజ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భారతదేశం, ప్రజాస్వామ్యం పట్ల, భారతదేశ ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
సిక్కులను ఊచకోత కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ గురించి తప్పుగా మాట్లాడింది ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులేనని మేము కాదని, రేవంత్ రెడ్డితో పోతే కుక్క తోక పట్టి గోదావరి ఈగినట్టు అవుతుందని, రాజకీయాలకు రావాలంటే కొత్త యువత భయపడుతున్నారని కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు ఉంది కౌశిక్ రెడ్డి వ్యవహారం అని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బండి సంజయ్ పై వరంగల్ జిల్లాలో దాడి గురించి కేటీఆర్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అలాగే సభ్యత్వ నమోదు గురించి మాట్లాడుతూ గణాంకాలు, అంకెలు కాదని పూర్తి స్థాయి సైద్ధాంతిక ఉద్యమం అని పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. సభ్యత్వం అంటే పార్టీ సభ్యుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని, దేశాన్ని బలోపేతం చేయడం కూడా అని అభివర్ణించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవిత్ర కార్యంగా భావించాలని, వేడుకగా మార్చాలని అన్నారు. బీజేపీ కార్యకర్తల మనోభావాలు దేశభక్తితో ప్రేరణ పొందాయని, భరతమాత సంక్షేమం కోసం, 140 కోట్ల మంది దేశ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధమై ఉన్నాయని అన్నారు. కొత్త వారిని సభ్యులుగా చేర్చుకుని వారికి ఉపకారం చేశామనే భావన కలిగించకూడదని, దేశ ప్రయోజనాల కోసం వారు ముందుకు రావడం మనకు గర్వకారణం అన్న భావన కలిగించాలని సూచించారు.