- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాబ్ మేళా ను విజయవంతం చేయండి: కలెక్టర్
దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈనెల 12వ తేదీన, నిర్వహించనున్న జాబ్ మేళా ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో ప్రముఖ కంపెనీలు, సంస్థలు పెద్ద మొత్తంలో జాబ్ మేళాను నిర్వహించనున్నామన్నారు. ఇప్పటికే పత్రికా ప్రకటన ద్వారా దాదాపు 16 వందల మంది నిరుద్యోగుల నుంచి జాబ్ మేళా లో పాల్గొనడానికి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు.
నిరుద్యోగులకు జాబ్ మేళా లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాల్గొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం వివిధ కంపెనీలకు స్టాళ్లు ఏర్పాటు, నిరుద్యోగుల కొరకు త్రాగునీరు, కుర్చీలు, తదితర ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలన్నారు. అధిక సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొనడానికి వచ్చే నిరుద్యోగులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పోలీస్ శాఖ, జిల్లాస్థాయి అధికారుల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సింగరేణి క్లబ్ హౌస్ కి వారి విద్యార్హతల ఒరిజినల్, జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, డీఆర్డీఓ పురుషోత్తం, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్యామల, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శైలజ, సీపీఓ కే శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.